Telangana Rythu Runa Mafi Details : తెలంగాణ రైతులకు రూ. 2 లక్షల పంట రుణమాఫీ ప్రకటన

Telangana Rythu Runa Mafi Details : తెలంగాణ రైతులకు అద్భుతమైన శుభవార్త: రూ. 2 లక్షల పంట రుణమాఫీ ప్రకటన

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టింది.  రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఎంతో ఆశగా ఎదురుచూసిన రైతు రుణమాఫీ పథకాన్ని గైడ్ లైన్స్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తారు . రైతు రుణ మాఫీ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది రైతులకు ఊరట కలిగించనుంది.

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Telangana Rythu Runa Mafi Details – ముఖ్యమైన అంశాలు:

1. అర్హత: తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
2. రుణ పరిమితి: గరిష్టంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తారు.
3. కాలపరిమితి: 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. రైతు రుణ మాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే.
4. అర్హత ప్రమాణం: తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి పక్కా.
5. రైతు భూమి తన పేరు మీద ఉండాలి.

Telangana Rythu Runa Mafi Details – పథకం అమలు విధానం:

1. వ్యవసాయ శాఖ కమిషనర్ రైతు రుణ మాఫీ పథకాన్ని పర్యవేక్షిస్తారు.
2. ప్రత్యేక ఐటీ పోర్టల్ ద్వారా మాత్రమే రైతుల సమాచారం సేకరించి, ధృవీకరించబడుతుంది.
3. ప్రతి గ్రామంలోని బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమిస్తుంది.
4. బ్యాంకులు రైతుల రుణ వివరాలను డిజిటల్ సంతకంతో సమర్పించాలి.
5. ఆధార్ నెంబర్ ద్వారా రైతు కుటుంబాలను గుర్తించబడతాయి.
6. రుణమాఫీ మొత్తం నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తారు .

Telangana Rythu Runa Mafi Details – ప్రత్యేక నిబంధనలు:

1. రూ. 2 లక్షలకు మించిన రుణం ఉన్న రైతులు, 2లక్షలపైనా ఉన్న అదనపు డబ్బలను చెల్లించాలి.
2. కుటుంబంలోని మహిళల రుణాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
3. కంపెనీలు, సంస్థలకు ఇచ్చిన రుణాలకు రైతు రుణ మాఫీ పథకం వర్తించదు.
4. పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా వర్తించదు.

Telangana Rythu Runa Mafi Details -రైతులు ఏం చేయాలి?

1. రైతు రుణ మాఫీ కి కేటాయించి దరఖాస్తు పత్రాన్ని  పూర్తి చేయాలి.
2. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, రుణ వివరాలను తప్పులు పోకుండా సరిగ్గా నింపాలి.
3. ఏవైనా సందేహాలు ఉంటే, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను వద్ద వెళ్లి తీసుకుకోవాలి.

రుణ మాఫీ పథకం తెలంగాణ రైతుల జీవితాలలో గణనీయమైన మార్పును తీసుకురానుంది. రుణ భారం తగ్గడంతో, రైతులు మరింత మనో దైర్యంతో వ్యవసాయం చేయగలరు. ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజం లభించే అవకాశం ఉంది.

Leave a Comment