Sukanya Samriddhi Yojana Telugu :సుకన్య సమృద్ధి యోజన నెలకు 200కడితే 3లక్షలు మీ సొంతం

Sukanya Samriddhi Yojana Telugu సుకన్య సమృద్ధి యోజన 2024 – Minimum deposit ₹ 250/- Maximum deposit ₹ 1.5 Lakh in a financial year. for more details check below.

ప్రియమైన మిత్రులారా , ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారత్ దేశంలోని బాలికల ఉజ్వల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY Scheme)ను ప్రారంభించారు. మీ ఇంట్లో ఆడపిల్ల జన్మించిందా?, ఆమె భవిష్యత్తు గురించి మీరు భయపడుతున్నట్లయితే, ఇక మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం మీకు పుట్టిన ఆడబిడ్డ భవిష్యత్తులో విద్య మరియు పెళ్లి ఖర్చులను భరించడానికి ఈ సుకన్య యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో మీ పాపని ఎలా చేర్చాలి ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు చూద్దాం.

Sukanya Samriddhi Yojana Telugu – సుకన్య సమృద్ధి యోజన ఏమిటి?

సుకన్య సమృద్ధి యోజన(SSY) అనేది భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక పొదుపు పథకం. సుకన్య సమృద్ధి యోజన  కింద, తల్లిదండ్రులు తమ కూతురు పేరున ఒక ప్రత్యేక ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతా ద్వారా, వారు తమ కూతురు భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు. వల్ల భవిష్యత్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా చేయవచ్చు.

Sukanya Samrudhi Yojana ప్రధాన లక్షణాలు

1. ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తె 10 సంవత్సరాల వయస్సు లోపు ఈ ఖాతా తీసుకోవచ్చు.
2. ఈ ఖాతాను బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో ఓపెన్ చేయవచ్చు .
3. ప్రతి సంవత్సరం ₹250రూపాయల నుండి ₹1.5 లక్షల వరకు ఎంతైనా జమ చేయవచ్చు.
4. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం వడ్డీ ప్రస్తుతం 7.6% కింద చెల్లించబడుతుంది.
5. ఈ పథకం కింద, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టాక్స్ కూడా మినహాయింపు లభిస్తుంది.

Sukanya Samriddhi Yojana Telugu Eligibility – అర్హత

1. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచే సమయంలో బాలిక  10 సంవత్సరాలు వయస్సు మించకూడదు.
2. మీ కూతురు లేదా ఆడబిడ్డ అలాగే తల్లిదండ్రులు భారతదేశ పౌరులై ఉండాలి.
3. ఒక కుటుంబంలో గరిష్ఠంగా రెండు సుకన్య సమృద్ధి అకౌంట్లు కూతురు పేరున ఖాతాలు తెరవవచ్చు.

అవసరమైన పత్రాలు

1. మీ కూతురు లేదా ఆడబిడ్డ జనన ధృవీకరణ పత్రం పక్కా ఉండాలి.
2. బాలిక యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డు / పాన్ కార్డు / గుర్తింపు కార్డు పక్కా ఉండాలి.
3.  మీరు ఇక్కడ ఉంటున్నారో అక్కడి నివాస ధృవీకరణ పత్రం కూడా కావాలి.
4. బాలిక మరియు తండ్రి లేదా తల్లి పాస్‌పోర్ట్ సైజు ఫొటో కూడా అవసరం అవుతాయి.

ఖాతా తెరవడం ఎలా

1. మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా ఇండియన్ పోస్ట్ ఆఫీసుకు వెళ్లండి.
2. సుకన్య సమృద్ధి యోజన దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోండి .
3. దరఖాస్తు ఫారమ్‌లో అన్ని వివరాలను జాగ్రత్తగా చూసి రాయండి.
4.ఇంకా అవసరమైన పత్రాలను సుకన్య సమృద్ధి యోజన ఫారం తో జతచేయండి.
5. పూర్తిగా ఒక్కటికి రెండు దార్లు చెక్ చేసుకొని దరఖాస్తును సమర్పించండి.

Sukanya Samriddhi Yojana Plans –  పెట్టుబడి మరియు వడ్డీ వివరాలు

– కనీస సంవత్సరానికి డిపాజిట్: ₹250 రూపాయలు.
– గరిష్ట సంవత్సరానికి డిపాజిట్: ₹1,50,000
– ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు వడ్డీ రేటు: 7.6% (సంవత్సరానికి) 

డబ్బు ఉపసంహరణ నిబంధనలు

1. మీ కూతురు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాతే  ఖాతాలో ఉన్న మొత్తంలో 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు .
2. బాలిక 21  సంవత్సరాలు పూర్తి అయినా తర్వాత మాత్రమే  పూర్తి ఉపసంహరించవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన కాల్కులేటర్

మీ కూతురు పై ప్రతి నెల ₹1000రూపాయలు జమ చేస్తే, 21 సంవత్సరాలు పూర్తి అయినా తర్వాత మీరు పొందే మొత్తం:

– మొత్తం డిపాజిట్ చేసిన డబ్బు : ₹1,80,000 రూపాయలు
– మొత్తం వడ్డీ: ₹3,29,000 రూపాయలు
– 21సంవత్సరాలు నిండిన తర్వాత మొత్తం: ₹5,09,212 రూపాయలు తీసుకోవచ్చు.

 ముగింపు

సుకన్య సమృద్ధి పథకం మీ కుమార్తె భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఉపయోగం పడుతుంది . ఈ పథకంలో చేరడం ద్వారా, మీకు మీ కుమార్తె ఉన్నత చదువుల కోసం మరియు పెళ్లి ఖర్చుల కోసం ముందస్తుగా ఉపయోగపడుతాయి . ఈ రోజే మీ దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసును సందర్శించి, మీ కూతురి ఉజ్వల భవిష్యత్తుnu నిర్మించడం కోసం ప్రారంభించండి!

FAQ’s

Q1. How many years need to pay for Sukanya Samriddhi Yojana?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో 15 సంవత్సరాలు వరకు డబ్బులు చెల్లించాలి. పోస్ట్ ఆఫీస్ ఖాతా లేదా బ్యాంకు ఖాతా వ్యవధి 21 సంవత్సరాలు ఉంటుంది.

Q2. What are the benefits of the Sukanya samriddhi scheme?
సుకన్య సమృద్ధి యోజనలో ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది , ఆదాయపన్ను కూడా మినహాయింపు అలాగే భవిష్యత్తు మీ కూతురికి విద్యా, పెళ్లి ఖర్చులు కోసం రక్షణ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.


Q3. సుకన్య సమృద్ధి యోజన ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి?
సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాలు వరకు చెల్లించాలి. ఖాతా 21 సంవత్సరాలు వరకు ఉంటుంది.

Q4. When can I withdraw money from Sukanya?
సుకన్య సమృద్ధి యోజనలో 18 ఏళ్ళు నిండిన బాలిక చేరినప్పుడు లేదా 10 సంవత్సరాలు సుకన్య సమృద్ధి ఖాతా నిర్వహించిన తరువాత ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చిన సందర్భంలో డబ్బు ఉపసంహరించుకోవచ్చు.
Q5. Which is better Sukanya samriddhi vs LIC?
సుకన్య సమృద్ధి యోజన ఎక్కువ వడ్డీ రేటు మరియు ఆదాయపన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది, పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఎంపిక. LIC పాలసీలు వివిధ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి, కానీ వడ్డీ రేట్లు తక్కువగా ఉండవచ్చు. అందువల్ల, మీ లక్ష్యాలు మరియు అవసరాలను బట్టి ఎంపిక చేయాలి.

Leave a Comment