AP Yuva Nestam Apply Online: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఊరట కలిగించే శుభవార్త . కొత్త అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం యువ నేస్తం పథకం ద్వారా నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తుంది. నిరుద్యోగ భృతి పథకం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిరుద్యోగ భృతి అర్హత:
1. విద్యార్హతలు:
-నిరుద్యోగ భృతికి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
2. వయసు పరిమితి:–
18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువతీయువకులు ఈ పథకానికి అర్హులు
3. నివాస యోగ్యత:
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసం ఉన్న నిరుద్యోగ యువతీయువకులకు మాత్రమే.
AP Yuva Nestam Apply Online – అనర్హులు:
– మీకు 5 ఎకరాలకు మించి సాగుభూమి కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు.
– ప్లాట్ కానీ ఇల్లు కానీ 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ జాగా ఉన్నవారు అనర్హులు.
– కుటుంబంలో ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఈ పథకం వర్తించదు.
– ప్రభుత్వం నుండి కుటుంబ సభ్యులలో ఎవరికైనా పింఛను వస్తే వారికీ కూడా నిరుద్యోగ భృతి రాదు.
దరఖాస్తు ప్రక్రియ:
1. ఆన్‌లైన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
– యువ నేస్తం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మీ డీటెయిల్స్ నింపి అప్లై చేసుకోవాలి.
2.ఆఫ్ లైన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
మీ గ్రామ/పట్టణం సచివాలయంలో దరఖాస్తు పారంని పొంది వాటిలో వివరాలు నింపి కావాల్సిన సర్టిఫికెట్స్ లను జత చేసి సంబంధిత అధికారానికి అందజేయండి.
అవసరమైన పత్రాలు:
– ఆధార్ కార్డు
– పాన్ కార్డు
– స్టడీ సర్టిఫికెట్స్
– ఇల్లు ఉంటే ధృవీకరిచిన పత్రం లేదా ఇంటి ప్రూఫ్
– ఇన్కమ్ సర్టిఫికెట్
ధృవీకరణ ప్రక్రియ:
– నిరుద్యోగ భృతికి సంబంధిత అధికారులు మీరు చేసిన దరఖాస్తును పరిశీలించి అర్హతను ఉన్నవారిని ప్రకటిస్తారు.
AP Yuva Nestam Apply Online – ప్రయోజనాలు:
– నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ద్వారా ఆర్థిక సహాయంగా ఉపయోగపడుతుంది.
– ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
ముగింపు:
యువ నేస్తం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తోంది. అర్హత ఉన్న యువతీయువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని , తమ టాలెంట్ ని పెంచుకోవడానికి ,ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు మీ వంతుగా ప్రయత్నం చేయండి . ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడాలి అని ఆశిద్దాం.
Super